నాగార్జున వేసుకున్న షర్ట్పై చర్చ.. ప్రత్యేకత ఏంటంటే!

నాగార్జున వేసుకున్న షర్ట్పై చర్చ.. ప్రత్యేకత ఏంటంటే!

తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి(Akkineni NageswaraRao centenary) ఉత్సవాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించి..ANR ని స్మరించుకున్నారు. లేటెస్ట్గా ఈ ఫంక్షన్లో నాగార్జున వేసుకున్న షర్ట్.. అక్కీనేని ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్న హై లెవెల్ క్యాస్ట్యూమ్స్ పై చర్చ నడుస్తుంది. కానీ, నాగార్జున వేసుకున్న ఈ సింపుల్  లైట్ ఎల్లో & లైట్ బ్లూ కాంబినేషన్ తో ఉన్న.. ఈ షర్ట్ లో అంతా ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా? చూద్దాం. 

ఏట్రో ప్లైస్లీ బ్రాండ్ కు చెందిన ఈ షర్ట్ కాస్ట్ సుమారు రూ. 83,908 లు. మరి ఈ షర్ట్ను చూస్తే అలా అస్సలు అనిపించట్లేదు కదూ. అంతేకాకుండా ఈ షర్ట్ లండన్ బీచ్లో తక్కువ కాస్ట్కి దొరుకుతుందనే ఫీలింగ్ కూడా కలగొచ్చు. కానీ, ఈ షర్ట్.. కింగ్ నాగ్ వేసుకున్నాడు కదా..కింగ్ సైజ్ లుక్తో పాటు, రేట్ కూడా హైలోనే ఉంటుంది. బిగ్ బాస్‌లో సీజన్స్ లో నాగార్జున వేసుకునే ప్రతి షర్ట్ కూడా వేలల్లోనే ఉంటుంది. సుమారు రూ.30 వేలు మొదలుకొని..లక్ష రూపాయల వరకూ నాగార్జున షర్ట్స్ రేటు ఉంటాయని సమాచారం. అలాగే ఈ షర్ట్ కి మరో స్పెషల్ కూడా ఉంది.

2021 బిగ్బాస్ సీజన్ 5 ఓ వీకెండ్ ఎపిసోడ్లో..నాగార్జున ఆల్రెడీ ఈ షర్ట్ను వేసుకున్నారు.  మళ్ళీ రెండేళ్ల తరువాత నాగ్ ఈ షర్ట్ వేసుకోవడంతో..ఆడియన్స్ ఫోకస్ మొత్తం దీనిపైనే పడింది. అసలు సెలబ్రెటీస్ ఒక్కసారి వేసుకున్న డ్రెస్సెస్ మళ్ళీ వేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది నాగార్జున మళ్ళీ ఈ షర్ట్ వేసుకోవడంతో..నెటిజన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మన్మధుడు అయినప్పటికీ, ఎక్కడ ఎలా ఉండాలో నాగ్కి తెలుసు అంటూ..ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ వేడుకలకు అక్కినేని కుటుంబంతో పాటు.. అల్లు అరవింద్, మోహన్ బాబు, బ్రహ్మానందం, జయసుధ, మహేష్ బాబు, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, తదితర సినీ తారలు హాజరయ్యారు.