సిక్స్‌ ప్యాక్ తో పండగే!

సిక్స్‌ ప్యాక్ తో పండగే!

తెలుగు నాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌ గా మారింది. ఇప్పటికే చాలామంది హీరోలు సిక్స్‌‌ ప్యాక్స్‌‌తో తమ అభిమానులను ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో సాయి తేజ్ కూడా చేరాడు. తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రతి రోజు పండగే’. రాశీఖన్నా హీరోయిన్. సత్యరాజ్, రావు రమేష్‌‌ కీలక పాత్రలు పోషించారు. అవడానికిది ఫ్యామిలీ ఎంటర్‌‌టైనరే అయినా..ఇందులో రెండు సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి . వాటిలో సాయితేజ్ సిక్స్ ప్యాక్‌‌తో కనిపించనున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా ఒక యాక్షన్‌‌ సీన్ ఉంటుంది. అందులో షర్ట్‌‌ లేకుండా తన సిక్స్‌‌ ప్యాక్‌‌ను ఎక్స్‌‌పోజ్ చేస్తూ ఫైట్ చేస్తా డు తేజ్. దీని కోసం ఫిట్‌ నెస్ ట్రైనర్‌‌‌‌ను పెట్టుకుని, వర్కవుట్ చేసి మరీ సాధించాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇక తేజ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ని, యాక్షన్ సీక్వెన్సు ల్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అవ్వడమే మిగిలింది.