ఎందుకు చేయను? కచ్చితంగా చేస్తాను

ఎందుకు చేయను? కచ్చితంగా చేస్తాను

సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ‘ఫ్యామిలీమేన్ 2’ ద్వారా నార్త్ ఇండియన్స్‌‌కి దగ్గరైన ఆమె, త్వరలో ఓ హిందీ సినిమాలోనూ నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమా కాదా అనే సందేహం అందరిలోనూ ఉంది. దానికి సమాధానం సమంత దగ్గరే దొరికింది. రీసెంట్‌‌గా ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన సమంత, అక్కడ తన కెరీర్ గురించి ముచ్చటించింది. బాలీవుడ్‌‌లో వర్క్‌‌ చేస్తారా అని అడిగితే.. ‘ఎందుకు చేయను? కచ్చితంగా చేస్తాను. భాషతో సమస్య లేదు. కాకపోతే కథ నచ్చాలి. స్క్రిప్ట్ బాగుందా? మనసుల్ని తాకుతుందా? ఆ కథకి, పాత్రకి నేను సరిపోతానా? ఈ ప్రశ్నలన్నీ వేసుకున్న తర్వాతే నేను ఏ ప్రాజెక్ట్‌‌కైనా ఓకే చెప్తాను. బాలీవుడ్‌‌లో కూడా అంతే. నచ్చిన కథ దొరికితే చేయడానికి ఎప్పుడూ రెడీనే’ అని చెప్పింది సామ్. ఆల్రెడీ ఓకే చెప్పిందా, ఇంకా చెప్పాల్సి ఉందా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాప్సీ నిర్మించే ఓ మూవీకి సామ్ కమిటయ్యిందని, త్వరలోనే అనౌన్స్‌‌మెంట్ రానుందని బాలీవుడ్ టాక్. అయితే ఎంత బాలీవుడ్‌‌లో వర్క్ చేసినా టాలీవుడ్‌‌ అంటే తనకి చాలా ఇష్టమని, హైదరాబాద్ తన పుట్టినిల్లు అని కూడా చెప్పింది సామ్. అంటే ఒకవేళ అక్కడ బిజీ అయిపోయినా ఇక్కడ నటించడం మానను అని చెప్పినట్టే కదా! సమంత ముంబైలో ఇల్లు కొనుక్కుందని, అక్కడే సెటిలైపోతుం దని వస్తున్న వార్తలకు ఈ ఒక్క మాటతో చెక్‌‌ పెట్టినట్టేగా!