తెర వెనక కనిపించని డాక్టర్లే నిజమైన స్టార్స్

తెర వెనక కనిపించని డాక్టర్లే నిజమైన స్టార్స్

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు  తనకెంతో సంతోషంగా ఉందన్నారు సినీ నటి సమంత. కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ మెడికల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డి, సినీ నటులు నాగ చైతన్య ,సమంత పలువురు  ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమంత.. తాము తెర మీద కనిపించే స్టార్స్ అయితే తెర వెనక కనిపించని డాక్టర్లే నిజమైన స్టార్స్ అని అన్నారు. ఉమెన్స్ ఎడ్యుకేషన్ లో మల్లారెడ్డి గారు చేస్తున్న కృషి గొప్పదన్నారు నాగచైతన్య. ఏదైనా కాలేజ్ ఈవెంట్ కు వెళ్తుంటే తనకు హ్యాపీగా ఉంటుందన్నారు.ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని చూస్తుంటే తన కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయన్నారు.