IPL 2024: డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డును సమం చేసిన కింగ్ కోహ్లీ

IPL 2024: డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డును సమం చేసిన కింగ్ కోహ్లీ

IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డును సమం చేశాడు కోహ్లీ. IPL 17లో భగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ.. 44 బంతుల్లో 70* పరుగులతో ఐపీఎల్ 2024లో 500 పరుగుల మార్కును చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.  ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో ఏడోసారి ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ.. 500 ప్లస్ పరుగులు చేశాడు.   దీంతో డేవిడ్ వార్నర్ IPL రికార్డును కోహ్లీ సమం చేశాడు. డేవిడ్ వార్నర్ గతంలో ఏడుసార్లు ఒక సీజన్‌లో 500-ప్లస్ పరుగులతో రికార్డు నెలొల్పాడు.  ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

కోహ్లి.. 2011, 2013, 2015, 2016, 2018, 2023, 2024 ఎడిషన్లలో 500+ పరుగులు సాధించి 239 IPL ఇన్నింగ్స్‌లలో 7763 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 167 పరుగులు చేసిన వార్నర్ ప్రస్తుత ఎడిషన్‌లో 500-ప్లస్ మార్క్‌ను చేరుకునే అవకాశం లేదు.

Also Read:టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

ఇక,  బెంగళూరుకు సరికొత్త రికార్డు సృష్టించింది. రెండోసారి 200+ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.  తొలిసారి 2010లో 200+ పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే 200+ పరుగులను ఛేజింగ్‌ చేసిన జట్టుగా ఆర్సీబీ నయా రికార్డ్ నెలకొల్పింది. IPL చరిత్రలో తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు మిగిలి ఉండగానే 200+ లక్ష్యాన్ని ఛేదించిన మొదటి జట్టగా బెంగళూరు నిలిచింది. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో  కేవలం 16 ఓవర్లలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది బెంగళూరు. ఇంగ్లిష్‌ బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేసి ఆర్సీబీ అభిమానులు అలరించాడు.

కాగా, రెండు వరుస విజయాలతో ఫామ్ లోకి వచ్చినా బెంగళూరు ప్లేఆఫ్ కు చేరుకోవాలంటే.. మిగిలిన నాలుగు లీగ్- గేమ్‌ల్లోనూ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దాదాపుగా RCBకి ప్లేఆఫ్ దారులు మూసుకుపోయినట్లే. ప్రస్తుతం బెంగళూరు..10 మ్యాచ్ లలో కేవలం మూడు విజయాలతో IPL 2024 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.