Priyadarshi: హీరోగా ప్రియదర్శి ఫుల్ బిజీ.. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్

Priyadarshi: హీరోగా ప్రియదర్శి ఫుల్ బిజీ.. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్

పెళ్లి చూపులు(Pelli Chupulu) సినిమాతో కమెడియన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రియదర్శి(Priyadarshi). ఈ సినిమాలో అతని నటనతో ఎంతోమంది ఆడియన్స్ ను అలరించడమే కాదు.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ, బలగం సినిమాతో తనలోని మరోకోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ప్రియదర్శి. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే.. బలగం సినిమా తరువాత ప్రియదర్శికి ప్రత్యేకపాత్రల డిమాండ్ పెరిగింది. ఇటీవల వచ్చిన మంగళవారం సినిమాలో కూడా ప్రత్యేకపాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ పాత్రకి కూడా ప్రశంసలు అందుకున్నాడు ప్రియదర్శి. ఇక ప్రస్తుతం సోలో హీరోగా మారిపోయాడు ఈ కమెడియన్. హీరోగా వరుస క్రేజీ సినిమాలను ఒకే చేస్తున్నాడు. అందులో ముందుగా డార్లింగ్ సినిమా ఉంది. ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక టాలీవుడ్ స్టార్ రానా నిర్మాణ సంస్థలో మరో సినిమా చేస్తున్నారు ప్రియదర్శి. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాను  కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇవేకాకుండా.. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు ప్రియదర్శి. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో రూప కొడవాయూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేస్తూ కెరీర్ పీక్స్ లో ఉన్నాడు ప్రియదర్శి. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా మనోడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరడం ఖాయం.