ఇదే సరైన సమయం..సమంత న్యూ ఇయర్ పోస్ట్ వైరల్

ఇదే సరైన సమయం..సమంత న్యూ ఇయర్ పోస్ట్ వైరల్

తెలుగులో  ‘ఏ మాయ చేశావో’తోనే తనకంటూ ఒక స్టైల్‌ ను, ఒక సెపరేట్‌‌‌‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌‌‌‌ను తెచ్చుకున్న ‘సమంత’ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్న  సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ సామ్.. పలు పోస్టులు చేస్తోంది. లేటెస్ట్ గా  ఇన్ స్టాగ్రామ్ వేదికగా  సమంత తన ఫ్యాన్స్ కు అడ్వాన్స్ గా న్యూ ఇయర్ విషెస్ చెప్పింది

‘మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి. సులభమైన లక్ష్యాల కోసం ఇదే సరైన సమయం. సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి. దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. అడ్వాన్స్ హ్యపీ న్యూ ఇయర్‌ 2023’ అంటూ పోస్టు చేసింది. దీనికి కేవలం మూడు గంటల్లోనే 14 లక్షలపైగా లైక్స్ చేశారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొందరు.. మరికొందరు మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ‘యశోద’ చిత్రంలో నటించింది. బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంలో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.