20 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  వీడ్కోలు పలికిన మీర్జా

20 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  వీడ్కోలు పలికిన మీర్జా
  • టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సానియాగుడ్​బై
  • 20 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  వీడ్కోలు పలికిన మీర్జా

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఇండియా లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సానియా మీర్జా.. టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పింది. దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఫ్రీ టోర్నీలో మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సానియా–మాడిసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 4–6, 0–6తో రష్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ వెరోనికా కుడెర్మెటోవా–లుడిమిలా సామ్సోనోవా చేతిలో ఓడారు. దీంతో 20 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ హైదరాబాదీ ఓటమితో వీడ్కోలు పలికింది. జనవరిలో ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా.. రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీతో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించింది. ఇక దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో సానియా జోడీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. గంటా 21 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండో–అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ తొలి సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గట్టి పోటీ ఇచ్చింది.  దీంతో  ఓ దశలో 4–4 స్కోరుతో సమంగా నిలిచినా.. తర్వాత సానియా జోడీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయింది. స్కోరు 5–4 వద్ద రష్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుకుని సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేజిక్కించుకున్నారు. ఇక రెండో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెరోనికా–లుడిమిలా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఎదురే లేకుండా పోయింది. బలమైన బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సానియా జంటను కట్టడి చేసింది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఒకే ఒక్క ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టిన సానియా ద్వయం ఒక డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మూడు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఒకదాన్ని కాపాడుకుంది. 

గాయాలు.. వివాదాలు

2006–07 మధ్య కాలంలో తిరుగులేని విజయాలు సాధించిన సానియా.. ఆ తర్వాత కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాయాలతో వెనకబడిపోయింది. 2008 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిప్రెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిన సానియాను 2010–12లో మణికట్టు గాయం తీవ్రంగా వేధించింది. దాదాపు మూడు సర్జరీలు చేయించుకోవడంతో ఆటపై పట్టు కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసంతో మళ్లీ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టి.. 2013–14లో వరుసగా డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరింది. 2015లో మళ్లీ మునుపటి ఆటతో చెలరేగింది. గాయాలతో పాటు సానియా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివాదాలూ ఉన్నాయి. 2008 బీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చాలా అభ్యంతరాలు వచ్చాయి. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోయబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెళ్లి చేసుకోవడం కూడా కొన్ని వివాదాలకు దారి తీశాయి. అయితే విమర్శలపై ఏనాడూ స్పందించని సానియా.. తన ఆటతోనే వాటికి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. 

ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోటు..

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మూడు సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మూడు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన సానియా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం లేదు. 2016లో రోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోపన్నతో కలిసి మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటమిపాలైంది. తర్వాత ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగినా.. మళ్లీ ఏనాడూ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచులకు వెళ్లలేకపోయింది. కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన సానియా.. అఫ్రో ఏషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. 

గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘సిక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’

ఆరేళ్ల వయసులోనే టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టిన సానియా.. 2001 నుంచి 2003 వరకు ఐటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. 2003లో ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్లో ఇండియా తరఫున చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకుంది. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సానియా ఆట ఓ మెట్టు పైకి ఎదిగింది. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఆరు గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గింది.  మార్టినా హింగిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా)తో కలిసి విమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు (2015 వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2016 ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపతి తో కలిసి రెండు మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2009 ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2012 ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను సాధించింది. బ్రూనో సోరెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి 2014లో యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సానియా 43 డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన సానియా సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం మెప్పించలేకపోయింది. ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే సరిపెట్టుకున్న సానియా.. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండోరౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటలేదు. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సానియా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు 271–161గా ఉంది. 2015లో డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్న సానియా.. ప్రస్తుతం 24వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించింది.