Sania Mirza: చివరి మ్యాచ్లో సానియాకు నిరాశ. కెరీర్కి కన్నీటి వీడ్కోలు

Sania Mirza: చివరి మ్యాచ్లో సానియాకు నిరాశ. కెరీర్కి కన్నీటి వీడ్కోలు

ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో ఫైనల్ చేరిన సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడికి చుక్కెదురైంది. తన చివరి గ్రాండ్ స్లామ్ లో విజయం సాధించి రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియాకు చివరికి నిరాశే మిగిలింది. ఫైనల్ మ్యాచ్ లో బ్రెజిల్ జోడి లూయిసా స్టెఫాని-రఫేల్ మటోస్ చేతిలో సానియా-బోపన్న జోడి ఓడిపోయింది. రెండు సెట్టల్లో 6-7, 2-6 పాయింట్లతో ఓటమి పాలయ్యారు. 

ఈ ఓటమితో తన టెన్నిస్ కెరీర్ కు సానియా కన్నీటితో వీడ్కోలు పలికింది. 2009లో మహేష్ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్ స్లామ్ ట్రోఫీ (ఆస్ట్రేలియన్ ఓపెన్) గెలిచింది. అవేకాకుండా మరో ఐదు (రెండు మిక్స్డ్ డబుల్స్, మూడు మహిళల డబుల్స్) ట్రోఫీలు గెలిచింది.