పంజాగుట్ట, వెలుగు: బాలికల రుతుస్రావ ఆరోగ్యంపై సుప్రీం కోర్టు గత నెల 13న ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ది గర్ల్ ఫౌండేషన్ ఫౌండర్ రోహిణి నాయుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు అంజలి డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం టీజీఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, అపరిశుభ్రత కారణంగా పలు రకాల వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రుతుస్రావంపై ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జసింతా దివాకరుణి, హీరా నందిని, సామాజిక కార్యకర్త సునీల్ పాల్గొన్నారు.
