ఆదిత్య థాకరేకు సంజయ్ దత్ మద్దతు

ఆదిత్య థాకరేకు సంజయ్ దత్ మద్దతు

శివసేన యువనాయకుడు ఆదిత్య థాకరేకు మద్దతు ప్రకటించారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఆదిత్య లాంటి యువకుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందన్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేతో తన కుటుంబానికి గొప్ప అనుబంధముందని… బాలాసాహెబ్ తనకెంతో మేలు చేశాడని చెప్పారు. థాకరేల కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆదిత్య థాకరే ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు సంజయ్ దత్.