Sanju Samson: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజు శాంసన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ (2026, ఏప్రిల్ 26న) చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ కేవలం11 రన్స్ చేశారు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఐపీఎల్ కెరీర్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకుని, ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పోడు. కేవలం 3,555 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడంతో సంజూ శాంసన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 5000 రన్స్ కంప్లీట్ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచారు.
ఈ క్రమంలో సంజు శాంసన్ సురేష్ రైనా (3620 బంతులు), కేఎల్ రాహుల్ (3688 బంతులు), ఎంఎస్ ధోనీ (3691 బంతులు) లాంటి దిగ్గజాల రికార్డులను అధిగమించారు. ఓవరాల్‌గా చూసుకుంటే, అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తర్వాత సంజూ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా ప్రారంభించారు. కానీ, మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్లో సంయమనంతో ఆడిన అతడు, ఆ తర్వాతి ఓవర్లో కగిసో రబాడ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ తరపున సుదీర్ఘకాలం ఆడిన సంజు శాంసన్ ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరి, పసుపు జెర్సీలోనూ తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. స్ట్రైక్ రేట్ పరంగా దిగ్గజాలకు ధీటుగా నిలుస్తూ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు, నిలకడగా, దూకుడుకు బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ 2026 సీజన్ లో ఇప్పటికే రెండు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.

