శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం.. బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి అనేక చర్యలు చేపట్టారు ఆలయ నిర్వాహకులు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయాల్లో పలు సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.