హైదరాబాద్ సిటీ, వెలుగు: హైకోర్టులో ‘సర్’ హెల్ప్ డెస్క్‌ను ఎలక్షన్స్ అడిషనల్ కమిషనర్ కె.చంద్రకళ గురువారం ప్రారంభించారు. 2002 నుంచి 2025లోపు ఓటర్లుగా నమోదైన వారి ఓటర్ మ్యాపింగ్ కోసం ఈ హెల్ప్ డెస్క్ పనిచేయనున్నది. దీని ద్వారా న్యాయవాదులు తమ ఓటు వివరాలను ఈజీగా మ్యాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
మరింత విస్తృతంగా సేవలందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాలు, ఆఫీసులు, ఉద్యోగ సంఘాలు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెంటర్లు తదితర స్టేక్‌హోల్డర్ల వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చంద్రకళ తెలిపారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

