రాజస్థాన్ కు చెందిన బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆసక్తికరమైన శపథం చేశారు. 2023లో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పీకేసే వరకు తాను పూలమాలలు వేసుకోనని, తలపాగా పెట్టుకోనని, రాత్రి పూట భోజనం కూడా చేయబోనని శపథం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సతీశ్ పూనియా ఈ కామెంట్స్ చేశారు.
