కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: సమీకృత జిల్లా కార్యాలయం నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ సత్య శారదాదేవి ఆదేశించారు. ఆదివారం సిటీలోని ఆజాం జాహీ మిల్లు స్థలంలో నిర్మింస్తున్న సమీకృత జిల్లా ఆఫీస్ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఖానాపూర్మండలం మనుబోతుల తండా, పెద్దమ్మగడ్డ తండా, ఖానాపూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, సౌకర్యాలతో పాటు ఇతర అంశాలపై ఆరా తీశారు. గడువులోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని సూచించారు.
