కిట్స్ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు కొత్త బీటెక్ కోర్సులు

కిట్స్ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు కొత్త బీటెక్ కోర్సులు

హసన్ పర్తి, వెలుగు  : వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు 2026–27 విద్యా సంవత్సరానికి రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అనుమతి లభించింది. బీటెక్ సైబర్ సెక్యూరిటీ, వీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) విభాగంలో అదనపు సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అనుమతి మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక్ రెడ్డి తెలిపారు. ఈ కొత్త కోర్సులకు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాయని, 2026–27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా కిట్స్ డబ్ల్యూ అదనపు కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ టెక్నాలజీల విస్తరణతో సైబర్ సెక్యూరిటీ, వీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, డేటా సైన్స్ వంటి రంగాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ కోర్సులు విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే కిట్స్ వరంగల్ లక్ష్యానికి ఈ కొత్త కోర్సులు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా కిట్స్ డబ్ల్యూ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ, ఈసీఈ విభాగాల అధ్యాపక బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, డీన్లు, విభాగాధిపతులు, రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.