5 పులులను దత్తత తీసుకున్న ఎస్‌‌‌‌బీఐ...నెహ్రూ జూపార్క్‌‌‌‌లో ఘనంగా పులుల దినోత్సవం

5 పులులను దత్తత తీసుకున్న ఎస్‌‌‌‌బీఐ...నెహ్రూ జూపార్క్‌‌‌‌లో ఘనంగా పులుల దినోత్సవం

చార్మినార్, వెలుగు: అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని నెహ్రూ జంతుప్రదర్శన శాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌‌‌‌బీఐ 5 పులులను ఏడాదిపాటు దత్తత తీసుకుంది. బహదూర్‌‌‌‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, జూ క్యూరేటర్ జె.వసంత సమక్షంలో ఎస్‌‌‌‌బీఐ సీజీఎం నిలేష్ ద్వివేది రూ.15 లక్షల చెక్కును జూ అధికారులకు అందజేశారు. 

బ్లూ యాండర్, ఎక్సెల్రా సొల్యూషన్స్ సంస్థలు, నాసర్ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా జూ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్​పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.