IPL 14  సీజన్: మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ రిలీజ్

IPL 14  సీజన్: మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ రిలీజ్

కరోనా వ్యాప్తి కారణంగా IPL 14  సీజన్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ ని పూర్తి చేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి ఈ మ్యాచ్ లు జరుగుతాయని UAE వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు కంటిన్యూ అవుతాయని తెలిపింది.

సెప్టెంబరు 19న ఐపీఎల్ పోటీలు షురూ అవుతాయని తెలిపింది BCCI. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. ఇప్పటికే 29 మ్యాచ్ లు జరగగా మరో 31 మ్యాచ్ లు ఉన్నాయని… వాటిని కూడా కేవలం 25 రోజుల సమయంలోనే ముగించనున్నట్లు చెప్పింది.