
హైదరాబాద్,వెలుగు: కాస్త లేటయినా ఎలాంటి తప్పులు లేకుండా టెన్త్ రిజల్ట్స్‌ను పక్కాగా ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ చెప్పారు. ఈసారి కొత్తగా స్కూల్ లెవల్ లో రిజల్ట్స్‌చూసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. విద్యాశాఖ స్కూల్ హెచ్‌ఎంకు కేటాయించిన లాగిన్ లో ఆ బడికి సంబంధించి న రిజల్ట్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. మార్కులపై డౌట్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోవచ్చన్నారు. సాఫ్ట్‌వేర్ ద్వారా ఐదంచెల్లో ఫలితాలన్నీ రీచెక్ చేస్తున్నామనీ, ఏమైనా అనుమానం వస్తే ఫీల్డ్ ద్వారా వెరిఫై చేయిస్తున్నామని చెప్పారు. రిజల్ట్స్ పై పేరెంట్స్, స్టూడెంట్స్ ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టెన్త్ వాల్యూయేషన్ విజయవంతంగా పూర్తయిందనీ, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ఆయన కోరారు. పదోతరగతిలో రీవెరిఫికేషన్ , రీకౌంటింగ్ విధానాలు కొనసాగుతాయని, రీవాల్యూయేషన్ విధానం కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరీశీలిస్తామని తెలిపారు. ఈ నెల మూడో వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.