తెలంగాణలో మళ్లీ దంచి కొడుతున్న ఎండలు..

తెలంగాణలో మళ్లీ దంచి కొడుతున్న ఎండలు..

రుతుపవనాలు కేవలం దక్షిణాదిలోని రెండు జిల్లాలకే పరిమితం కావడం.. వాయువ్యం నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టాయి. 19 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో 42.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లా సిరికొండ, కరీంనగర్​ జిల్లా రేణికుంట, ఖమ్మం జిల్లా ముదిగొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా రవీంద్రనగర్​, మహబూబాబాద్​ జిల్లా పెద్దనాగారం, నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, పెద్దపల్లి జిల్లా పాల్తెంలలో 42.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 

హైదరాబాద్​ సిటీ పరిధిలోనూ దాదాపు అన్ని సర్కిళ్లలోనూ 40 డిగ్రీలకు చేరువగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా మలక్‌‌‌‌‌‌‌‌పేట, రాజేంద్రనగర్​, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో 39.9 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. కాప్రా, సరూర్‌‌‌‌‌‌‌‌నగర్​, అంబర్‌‌‌‌‌‌‌‌పేట, యూసుఫ్‌‌‌‌గూడ, చందానగర్​, సికింద్రాబాద్, బేగంపేట్‌‌‌‌లో 39.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.