తేలు విషమే టీబీకి మందు

తేలు విషమే టీబీకి మందు

తేలు కుడితే ఆ మంటకు అల్లాడిపోతాం. కానీ, ఆ తేలు విషమే మందులకు లొంగని టీబీ (క్షయ)కి మంచి మందుగా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో తేలు విషం ప్రాణాంతక బ్యాక్టీరియాను చంపేసినట్టు అమెరికాలోని స్టాన్​ఫర్డ్​ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. ఆ విషం ప్రభావం ఆరోగ్యకరమైన కణాలపై పడలేదని తేల్చారు. మెక్సికోలో దొరికే డైప్లోసెంట్రస్​ జాతికి చెందిన తేళ్ల విషంలో రెండు రకాల రసాయనాలు యాంటీ బ్యాక్టీరియల్స్​గా పనిచేస్తున్నాయన్నారు. ఆ విషాన్ని సేకరించడమే చాలా ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. విషాన్ని తీసి మందుగా మార్చాలంటే ఒక గాలన్​ (3.8 లీటర్లు)కు  సుమారు రూ.300 కోట్లు (3.4 కోట్ల పౌండ్లు) ఖర్చవుతుందని చెప్పారు. బెంజోక్వినోన్​ గ్రూప్​కు చెందిన కాంపౌండ్లు టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాను, చర్మ ఇన్​ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేసిందన్నారు.