V6 News

హైద‌రాబాద్ టూ క‌ట‌క్.. 10 సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌

హైద‌రాబాద్ టూ  క‌ట‌క్.. 10 సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.  ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని   దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్ టూ  కటక్ మధ్య 10  వేసవి ప్రత్యేక రైళ్లను నడపేందుకు సిద్ధమయ్యింది. మే 30 నుంచి జూన్‌ 27వరకు  హైదరాబాద్‌ నుంచి కటక్‌ వరకు,  మే 31 నుంచి జూన్‌ 28 వరకు కటక్‌ నుంచి హైదరాబాద్‌ వరకు  ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.

  • హైదరాబాద్ టూ  కటక్ (07165)  రైలు మే 30,  జూన్ 6, 13, 20 , 27 తేదీల్లో నడుస్తుంది.
  • కటక్  టూ హైదరాబాద్ (07166) రైలు మే 31, జూన్ 7, 14, 21,  28 తేదీల్లో నడుస్తుంది.
  • ఈ ప్రత్యేక రైళ్లలో AC II టైర్, AC III టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ , స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.