
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన స్క్రీన్ రైటర్ శ్రేయస్ అయలూరి సినిమా ‘ది సెరీన్ ప్లేస్’ తో ప్రతిష్ఠాత్మక యూసీఎల్ఏ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డును గెలుచుకున్నారు. ఒక ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేట్ కాఫ్కా-వంటి ప్రపంచంలో సాగే ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు.
జీవితం, సినిమా ఇండస్ట్రీలో వింతలు, అడ్డంకులు, విజయానికి అడ్డుపడే గేట్‌కీపర్స్ నేపథ్యాన్ని హ్యూమర్ యాంగిల్లో చిత్రీకరించగా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రానికి శ్రేయస్ అయలూరి రచయితగా, శ్రియా రాణా దర్శకత్వం వహించారు. శ్రేయాస్ అయలూరి ఇప్పటికీ 30కి పైగా అవార్డులు గెలుచుకున్నారు.