లాక్ డౌన్ ఎత్తేసే టైం కాదిది

లాక్ డౌన్ ఎత్తేసే టైం కాదిది

కోపెన్ ​హాగెన్(డెన్మార్క్): కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన ఆంక్షలను తొలగించడానికి ఇది సరైన టైంకాదని డబ్ల్యూహెచ్ ఓ యూరప్​ రీజనల్​ డైరెక్టర్ హాన్స్​ క్లూగ్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. వైరస్​ కాస్త నెమ్మదించిందనే కారణంతో యురోపియన్​ దేశాలు కొన్ని ఆంక్షలు ఎత్తివేసే ఆలోచన చేస్తున్నాయన్నారు. ఏప్రిల్​ 14 నుంచి షాపులు, పబ్లిక్​ పార్కులను తెరుస్తామని ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో వైరస్ కేసులు కొత్తగా నమోదవుతున్న క్రమంలో ఆంక్షలు ఎత్తేసే ఆలోచన సరికాదని క్లూగ్  చెప్పారు. వైరస్​ ప్రబలకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సింది ఇప్పుడేనని, ఇప్పుడున్న ఆంక్షలను రెట్టింపు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు బుధవారం క్లూగ్ న్యూస్ కాన్ఫరెన్స్​లో​మాట్లాడారు. వైరస్​ను పూర్తిగా పారదోలాలంటే సొసైటీ సపోర్ట్​తో ఆంక్షలను మరింతగా పెంచడం తప్ప వేరే ఆల్టర్నేటివ్​ లేదన్నారు. ముఖ్యంగా మూడు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు.

1)  అవసరమైన రక్షణ సామగ్రిని అందించి హెల్త్​ సర్వీస్​వర్కర్లను కాపాడుకోవడం

2) హెల్త్​ సర్వే చేసి ఆరోగ్యవంతులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వేరుచేసి కరోనా వ్యాప్తిని స్లో చేయడం

3) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకోవడం ద్వారా వారిలో అవగాహన పెంచడం