
హైదరాబాద్: మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 9,900 కేంద్రాల్లో ఓటింగ్ ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని సిర్పూర్, అసిఫాబాద్ అసెంబ్లీ నియోజకర్గాలు, పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోక్‌సభ పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం లోక్ సభ పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్, మంథని..బెల్లంపల్లి లో ఎక్కువ శాతం ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మంచిర్యాల లో సమయం ముగిసినప్పటికి ఓటర్లు బారులు తీరారు. వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగియగానే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించనున్నారు. ఈ సాయంత్రంలోపు ఆయా ప్రాంతాల నుంచి ఈవీఎంలు కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు చేరుకొనే అవకాశం ఉంది.