త్వరలో పెళ్లి చేసుకుంటా.. ప్రకటించిన రాహుల్ గాంధీ

త్వరలో పెళ్లి చేసుకుంటా.. ప్రకటించిన  రాహుల్ గాంధీ

తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు.  రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు  పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని రాహుల్ ను ప్రశ్నించగా ఆయన నవ్వుతూ  త్వరలో పెళ్లి చేసుకోవాలి అంటూ బదులిచ్చారు.  దీనికి  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 గతంలో పెళ్లిపై స్పందించిన రాహుల్..  తాను ప్రజలక, కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అంకితభావంతో ఉన్నానని, పెళ్లికి  స్థానం లేదన్నారు.  కాగా 53ఏళ్ల రాహుల్ పెళ్లి గురించి గతంలో ఆయన తల్లి సోనియాను ఓ అభిమాని అడగ్గా మీరే ఓ మంచి పిల్లను చూడండి అని అన్న విషయం తెలిసిందే. కాగా రాహుల్ గాంధీ   కేరళలోని వాయనాడ్‌తో పాటుగా రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్నారు.  రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది.