న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ యునికార్న్ జెప్టో, ఆటో విడిభాగాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్‌మిషన్‌తో సహా మొత్తం ఆరు కంపెనీల ఐపీఓలకు సెబీ అనుమతిచ్చింది. హోటల్ పోలో టవర్స్, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, సర్జీవేర్ ఈ లిస్టులో ఉన్నాయి.
ఈ కంపెనీలు గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ప్రాథమిక పత్రాలను దాఖలు చేయగా, మే 4 నుంచి 8 మధ్య సెబీ పరిశీలనలు పూర్తయ్యాయి. క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో ఐపీఓకు రానుండటం ఇన్వెస్టర్లలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.7,500 కోట్ల నుంచి రూ.9,300 కోట్లు సేకరించాలని చూస్తోంది.
