హైదరాబాద్, కోనరావుపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ –3 (ప్యాకేజీ –9)లోని మల్కపేటలో రెండో మోటార్ ట్రయల్‌రన్ విజయవంతంగా పూ ర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున 12.40 గంటల నుంచి 1.40 గంటల మధ్య రెండో మోటార్ ట్రయల్‌రన్, వెట్రన్పూర్తి చేశారు. మల్కపేట పంపుహౌస్‌లో 30 మెగావాట్ల 2మోటార్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఫస్ట్ మోటార్ ట్రయల్, వెట్రన్మే 23న పూర్తయింది.
ఇప్పుడు రెండో మోటారును సమర్థవంతంగా రన్ చేశామని, ఈ పంపుహౌస్పూర్తి స్థాయిలో ఎత్తిపోతలకు సిద్ధమైందని ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని ఎత్తిపోసేందుకు మొదటి దశ పంపులు, మోటార్లు రెడీ అయ్యాయని అన్నారు.
