V6 News

ఆటలతోనే ఆరోగ్య తెలంగాణ.. బెస్ట్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీ6 వెలుగు క్రికెటర్ శ్రీకాంత్

ఆటలతోనే ఆరోగ్య తెలంగాణ.. బెస్ట్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీ6 వెలుగు క్రికెటర్ శ్రీకాంత్

హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌‌‌‌‌‌‌‌జేఏటీ) నిర్వహించిన  జ‌‌‌‌‌‌‌‌ర్నలిస్ట్ ప్రీమియ‌‌‌‌‌‌‌‌ర్ లీగ్ (జేపీఎల్‌‌‌‌‌‌‌‌) రెండో సీజన్ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ముగిసింది. ఈ టోర్నీలో వీ6 వెలుగు టీమ్ క్రికెటర్ శ్రీకాంత్ రెడ్డి బెస్ట్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యాడు. 

గురువారం దుండిగ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌లోని ఎంఎల్ఆర్ఐటీ క్రికెట్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జ‌‌‌‌‌‌‌‌రిగిన ఈ టోర్నీ ముగింపు వేడుక‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు హాజరైన స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్‌‌‌‌‌‌‌‌)  చైర్మన్  కె.శివ‌‌‌‌‌‌‌‌సేనా రెడ్డి, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబ‌‌‌‌‌‌‌‌ర్ వి.చాముండేశ్వరనాథ్‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌ల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ఎమ్మెల్యే మ‌‌‌‌‌‌‌‌ర్రి రాజ‌‌‌‌‌‌‌‌శేఖ‌‌‌‌‌‌‌‌ర్, ఇండి రేసింగ్ టీమ్ ఓనర్ అభిషేక్ రెడ్డి తో కలిసి ట్రోఫీలు అందజేశారు. 

ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా  శివసేనా రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇది ఆటలతోనే సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. 80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌, సైక్లింగ్‌‌‌‌‌‌‌‌లో పతకాలు గెలుస్తున్న ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐటీ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎన్‌‌‌‌‌‌‌‌ఈసీసీ సీఈఓ ఎజిహిల్ కుమార్ అన్నామలై, స్పోర్టివో ప్రతినిధి వృషాంక్ రెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.