సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌‌‌లో మానసిక రోగి కలకలం

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌‌‌లో మానసిక రోగి కలకలం
  •      ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి కిందకి వేలాడుతూ హల్‌‌‌‌చల్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌లో గురువారం ఓ మానసిక రోగి కలకలం సృష్టించాడు. ఉదయం 8.30గంటలకు రైల్వే స్టేషన్​ లోకి ప్రవేశించిన అకస్మాత్తుగాకేకలు వేస్తూ, అటూఇటు పరిగెత్తడంతో ప్రయాణికులు భయపడ్డారు. నాలుగో నంబర్​ప్లాట్​ఫాం ఫుట్​ఓవర్​ బ్రిడ్జి పై నుంచి కిందకి వేలాడడంతో ప్రయాణికులు దూకవద్దంటూ గట్టిగా అరిచారు. 

అంతలో ఓ ప్యాసింజర్​సదరు వ్యక్తిని పైకి లాగాడు. రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికి బంధువులు రావడంతో కౌన్సెలింగ్​ఇచ్చి అప్పగించారు. సదరు వ్యక్తి మెదక్​ జిల్లా చేగుంట మండలం తిమ్మయ్యపల్లికి చెందిన కరణ్​తోర్​ రతన్(32) అని, మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు.