పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం.. రాంగోపాల్‌పేటలోని అత్తెల్లి కుటుంబసభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. పూజల అనంతరం ప్రారంభమైన ఈ బోనం ఊరేగింపునకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
జోగిని శ్యామల మొదటి బతుకమ్మను ఎత్తుకొని చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని లోక కల్యాణార్థం ఆలయంలో ప్రత్యేకంగా చండీహోమం నిర్వహించారు. మేళతాళాలు, పోతరాజుల విన్యాసాల నడుమ ఘటం ఊరేగింపు వైభవంగా సాగింది. ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ప్రధాన మహంకాళి జాతరకు వచ్చే భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో మనోహర్‌రెడ్డి తెలిపారు.
