ప్రైవేట్ సిబ్బందితో బీజేపీ ఆఫీస్‌కు భద్రత

ప్రైవేట్ సిబ్బందితో బీజేపీ ఆఫీస్‌కు భద్రత

హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసుకు భద్రత పెంచారు. 18 మంది ప్రైవేట్ సిబ్బందితో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. బీజేపీ కార్యాలయానికి ముప్పుందని గతంలో ఇంటెలీజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. పలు భద్రతా లోపాలున్నాయని, వాటిని సరి చేసుకోవాలని సూచనలిచ్చాయి. భద్రత బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బీజేపీ నేతలు వాదించినా... రాష్ట్ర సర్కారు మాత్రం స్పందించలేదు. దీంతో బీజేపీనే భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంది. పార్టీ ఆఫీస్ లో మెటల్ డిటెక్టర్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుండి బీజేపీ కార్యాలయం పూర్తిగా ప్రైవేట్ భద్రతా సిబ్బంది చేతుల్లోకి వెళ్లనుంది.