తండ్రికి దూరంగా జేసన్ సంజయ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిన కొడుకు !

తండ్రికి దూరంగా జేసన్ సంజయ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిన కొడుకు !

తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ.. 108 అసెంబ్లీ స్థానాల్లో విజయదుదుభి మోగించారు  కోలీవుడ్ స్టార్ హీరో , టీవీకే అధినేత దళపతి విజయ్. పార్టీని స్థాపించిన తక్కువకాలంలోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించి  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఒకవైపు రాజకీయ విజయోత్సాహంతో విజయ్ పేరు మారుమోగుతుంటే..  మరోవైపు తన వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్న వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం దళపతికి తన కుమారుడు జేసన్ సంజయ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుంది.

తండ్రిని ఫాలో అవ్వని కొడుకు

విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలోనే, ఆయన కుమారుడు జేసన్ సంజయ్ తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారనే వార్త వైరల్‌గా మారింది. సంజయ్ కేవలం 38 మందిని మాత్రమే ఫాలో అవుతుండగా, అందులో విజయ్ సేతుపతి వంటి నటులు ఉన్నారు కానీ తండ్రి విజయ్ లేరు. అయితే, సంజయ్ అసలు మొదటి నుంచీ తండ్రిని ఫాలో కావడం లేదని కొందరు వాదిస్తుండగా.. లేటెస్ట్ వివాదాల వల్లే ఆయన దూరంగా ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. విజయ్ తమిళనాట ఎన్నికల్లో విజయం సాధించినా.. తండ్రికి కొడుకు విషెస్ కూడా చెప్పలేదు.   కాగా, జేసన్ ప్రస్తుతం 'సిగ్మా' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

విడాకుల వివాదం..

విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలోనే, ఆయన వైవాహిక బంధం ముక్కలైందనే వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.  ఫిబ్రవరి 2026లో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.  దాదాపు 27ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతూ ఆమె తీసుకున్న  నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేసింది. 2021 ఏప్రిల్‌లో విజయ్ మరొకరితో అఫైర్ పెట్టుకున్న విషయం తనకు తెలిసిందని, అది తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. నివాస సౌకర్యంతో పాటు భారీగా భరణం కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.  కోర్టు ఈ కేసును జూన్ 15కి వాయిదా వేసింది.

మౌనంగానే దళపతి..

ఒకవైపు కొడుకు జేసన్ సంజయ్ సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, కూతురు దివ్య విదేశాల్లో చదువుకుంటోంది. తన వ్యక్తిగత సమస్యలు బయటకు రాకుండా విజయ్ ఇన్నాళ్లూ జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. విడాకుల అంశంపై అటు విజయ్ గానీ, ఇటు సంగీత గానీ ఇప్పటివరకు బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఈ కీలక సమయంలో, ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన ఇమేజ్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.