ఈ వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నప్పుడు, ఎక్కడికైనా చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్తే మనసుకి, శరీరానికి హాయిగా, రిలాక్స్ గా ఉంటుంది. అలాంటి అద్భుతమైన 6 పర్యాటక ప్రదేశాల గురించి మీకోసం....
1. తమిళనాడులోని ఊటీ
ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉంది. మార్చి నుండి జూన్ వరకు ఇక్కడ వాతావరణం ఉష్ణోగ్రత 15 నుండి 25 డిగ్రీల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ అందమైన సరస్సులు, పూల తోటలు, టీ ఎస్టేట్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి ఇంకా చూడదగ్గవి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గం లాంటిది.
2. ఉత్తరాఖండ్ నైనిటాల్
ఢిల్లీకి దగ్గరగా ఉండి, తక్కువ సమయంలో వెళ్లిరావడానికి నైనిటాల్ ఒక మంచి ప్రదేశం. ఇక్కడ పగటి వాతావరణం చాలా బాగుంటుంది, రాత్రులు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. నైని సరస్సులో బోటింగ్ చేయడం, పురాతన దేవాలయాలను దర్శించడం ఇక్కడి ప్రత్యేకత. స్నో వ్యూ పాయింట్ నుండి హిమాలయాల అందాలను కళ్ళారా చూడదగ్గవి.
3. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి
సాహసాలు చేయాలనుకునే వారికి మనాలి సరైన గమ్యస్థానం. ఇక్కడ ఎప్పుడూ వాతావరణం చల్లగానే ఉంటుంది. మనాలి ప్రత్యేకతలు ఏంటంటే పారాగ్లైడింగ్, స్కీయింగ్ వంటి సాహస క్రీడలకు పెట్టింది పేరు. అటల్ టన్నెల్ అనే ఇంజనీరింగ్ అద్భుతాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు.
►ALSO READ | డైటింగ్ కష్టమనిపిస్తోందా ? ఈజీగా బరువు తగ్గాలా ? ఈ 5 పనులు చేయండి చాలు !
4. సిమ్లా
హిమాచల్ ప్రదేశ్ లోని మరో ప్రాంతం సిమ్లా.. ఇక్కడ ఒకవైపు ప్రశాంతత, మరోవైపు సందడి.. రెండూ కనిపిస్తాయి. ఇక్కడి వాతావరణం పగటిపూట ఆహ్లాదకరంగా, సాయంత్రం వేళల్లో బాగా చల్లగా ఉంటుంది. ఇక్కడ చూడదగ్గవి మాల్ రోడ్, జఖూ హిల్, రిడ్జ్ వంటి ప్రదేశాలు సందర్శనకు బాగుంటాయి. సిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
5. లడఖ్
విభిన్నమైన దృశ్యాలను చూడాలనుకునే వారు లడఖ్ వెళ్ళవచ్చు. ఇక్కడ పర్వతాలు, ఎడారులు ఒకే చోట కనిపిస్తాయి. ఇక్కడి వాతావరణం ఏడాది మొత్తం చల్లగా ఉంటుంది. లడఖ్ ప్రత్యేకతలు ఏంటంటే పాంగోంగ్ సరస్సు, నుబ్రా వ్యాలీ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. బైకింగ్, క్యాంపింగ్, రివర్ రాఫ్టింగ్ చేసేవారికి ఇదొక ఫేవరెట్ స్పాట్. అలాగే ఇక్కడి టిబెటన్ వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి.
6. మేఘాలయలోని షిల్లాంగ్
షిల్లాంగ్‌ను స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి జలపాతాలు, పచ్చని కొండలు, పైన్ అడవులు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి ఇంకా చూడదగ్గవి. ఉమియం సరస్సు, లైట్‌లమ్ కాన్యన్స్‌ను సందర్శించడం ఒక మరపురాని అనుభూతినిస్తుంది. ఎండల నుండి తప్పించుకుని కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటే ఈ వేసవిలో ఈ ప్రదేశాలలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి !
