మే 10న తెలంగాణకు ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

మే 10న తెలంగాణకు ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

హైదరాబాద్: ప్రధాని మోడీ 2026, మే 10న తెలంగాణలో పర్యటించనున్నారు. దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో రూ.7,823 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ బీజేపీ సికింద్రాబాద్‎లోని పరేడ్ గ్రౌండ్‎లో తలపెట్టిన జన ఆగ్రహ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. 

ప్రధాని మోడీ షెడ్యూల్

  • మే,10వ మధ్యాహ్నం 1.10కి బెంగళూర్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్‎కు బయలుదేరనున్న మోడీ
  • మధ్యాహ్నం 2:20 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న మోడీ
  • 2.30 కి బేగంపేట్ ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు మోడీ ప్రారంభోత్సవ , శంకుస్థాపనలు
  • ఇక్కడి నుంచి హెలికాప్టర్‎లో హైటెక్ సిటీ వెళ్లనున్న ప్రధాని 
  • 3.45-4.15 హైటెక్ సిటీలో సాయి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేస్తారు
  • 4.40 కి హెలికాప్టర్‏లో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు
  • 4.40-5.25 రిజర్వ్ 
  • 5.30కి పరేడ్ గ్రౌండ్‎కి చేరుకుంటారు
  • 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు
  • 6.45కి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్ రిటర్న్