శ్రీసిటీలో క్యారియర్ ఏసీ కంపెనీకి శంకుస్థాపన చేశారు మంత్రి నారా లోకేష్. బుధవారం ( మే 6 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు లోకేష్.ఇది దక్షిణ భారతదేశంలో క్యారియర్ కు తొలి తయారీ యూనిట్ కానుందని అన్నారు. భారతదేశంలోని అత్యంత చురుకైన పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లలో ఒకటైన శ్రీసిటీలో నేడు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు. ఈ రోజు కేవలం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ మరియు AI అభివృద్ధి యొక్క తదుపరి అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.
తన మొదటి ఎయిర్ కండిషనర్ కూడా క్యారియర్ దే అని... కాబట్టి ఇది కేవలం వ్యాపార సంబంధం కాదు, ప్రత్యేకమైన అనుబంధమని అన్నారు. మోడ్రన్ ఎయిర్ కండిషనింగ్ ను కనిపెట్టడం నుండి $50 బిలియన్ గ్లోబల్ సంస్థగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణలో ముందంజలో ఉందని అన్నారు.
ఇప్పుడు ఆ ఆవిష్కరణ మన రాష్ట్రానికి వస్తోందని... దీని ద్వారా రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి సుమారు మూడు వేల స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. ఇది మన రాష్ట్రం, మన ఎకోసిస్టమ్, మన సీఎం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకానికి నిదర్శనమని అన్నారు లోకేష్.
►ALSO READ | టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశం.. అక్షర గోవిందం.. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాల నిర్మాణం
"శ్రీసిటీ కేవలం ఒక పారిశ్రామిక పార్క్ కాదని.. గ్లోబల్ తయారీ కేంద్రమని అన్నారు. 8వేల 500 ఎకరాల విస్తీర్ణంలో 31 దేశాలకు చెందిన 250 కంపెనీలు ఉన్నాయని... 6 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 70 వేల ఉద్యోగాలు, అందులో 50శాతం మహిళలకు చెందడం విశేషమని అన్నారు. ఆటోమోటివ్ నుండి ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ నుండి ఇంజనీరింగ్ వరకు వేదిక అయిన శ్రీసిటీ “మేక్ ఇన్ ఇండియా”, “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్”కు ప్రతీక అని అన్నారు. ఉద్యోగుల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతంగా వున్న శ్రీసిటీ “స్త్రీ సిటీ”గా కూడా గుర్తింపు పొందుతోందని అన్నారు లోకేష్.
