డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచిత I-CET కోచింగ్ మాడ్యూల్ ప్రారంభం.. ఎక్కడంటే

డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచిత I-CET కోచింగ్ మాడ్యూల్ ప్రారంభం.. ఎక్కడంటే

కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం ఉచిత I-CET కోచింగ్ మాడ్యూల్ ప్రారంభించినట్లు 2026 మే 06వ తేదీన ప్రకటించింది.  ఈ కార్యక్రమం ద్వారా I-CET పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా మంచి కోచింగ్ అందించడమే లక్ష్యం అని ఈ సందర్భంగా కమిషనర్ ఎ. శ్రీదేవసేన తెలిపారు. 

ఈ డిజిటల్ వేదికలో అపరిమిత ప్రాక్టీస్ సెషన్లు, పూర్తి స్థాయి గ్రాండ్ టెస్టులు, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులు తమ చదువులో మెరుగుపడి, పరీక్షలకు బాగా సిద్ధమవ్వగలరు. 

అధికారిక వెబ్‌సైట్ https://ccets.info  

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు తప్పకుండా తెలియజేసి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మంది విద్యార్థులు తెలుసుకునేలా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరాన్ని కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఐటీ అధికారి తెలియజేశారు.

►ALSO READ | వరంగల్ NITలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు: బీటెక్, ఎంటెక్ చేసిన వారికి మంచి ఛాన్స్..