రవీంద్ర భారతిలో యువ నాటకొత్సవం వేడుకలు ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

రవీంద్ర భారతిలో యువ నాటకొత్సవం వేడుకలు ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువ నాటకోత్సవం వేడుకలను 2026 మే 06వ తేదీన ప్రారంభించారు మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ రవీంద్రభారతిలో మే  6,7, 8 మూడు రోజుల పాటు యువ నాటకోత్సవం వేడుకలు జరగనున్నాయి. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చాలా సంవత్సరాల నుంచి ప్రదర్శనలు నిర్వహిస్తున్నదని అభినందించారు. సంగీత నాటక అకాడమీ రాష్ట్రంలో యువ ఆర్టిస్ట్ లకు ఎంతగానో ఉపయోగ పడుతుందని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి, సంప్రదాయంలో భాగంగా సంగీత నాటకం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి గొప్ప నాటకాన్ని యువతకు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. 

►ALSO READ | ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సమాజంలో నటన నటులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయానికి తన నటన, రీల్స్ ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు.  యువ ఆర్టిస్టులకు యువ నాటకోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కొత్త ఆర్టిస్టులు సమాజానికి పరిచయం అవుతారని అన్నారు.