పాల ప్యాకెట్ల కలర్స్ వెనుక అసలు సీక్రెట్ ఏంటో తెలుసా ? మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..

పాల ప్యాకెట్ల కలర్స్ వెనుక అసలు సీక్రెట్ ఏంటో తెలుసా ?  మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..

మనం రోజూ కొనే పాల ప్యాకెట్లు నీలం, ఆకుపచ్చ, నారింజ వంటి వేర్వేరు రంగుల్లో ఉండటం మీరు గమనించే ఉంటారు. కానీ ఈ రంగులు కేవలం డిజైన్ కోసం కాదు, ఆ పాల ప్యాకెట్ లోపల ఉన్న పాలలో ఎంత కొవ్వు (Fat) ఉందో చెప్పడానికి ఒక గుర్తు. అవును.. మన దేశంలోని అమూల్, మదర్ డెయిరీ, విజయ వంటి ప్రముఖ కంపెనీలు సాధారణంగా ఈ కలర్ కోడింగ్‌ను పాటిస్తాయి.  

మన దేశంలో ఆహార పదార్థాల నాణ్యతను, వాటి ప్యాకెట్ల మీద ఉండాల్సిన వివరాలను FSSAI అనే సంస్థ పర్యవేక్షిస్తుంది. అయితే, పాల ప్యాకెట్లకు ఏ రంగు వేయాలనేది ఆయా డైరీ కంపెనీలే నిర్ణయించుకుంటాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం చాలా సింపుల్. ఆ ప్యాకెట్ లోపల ఉన్న పాలు ఎంత చిక్కగా ఉన్నాయి, అందులో ఎంత కొవ్వు (Fat) ఉందో రంగును చూడగానే మనకు అర్థం కావడానికి ఈ పద్ధతిని వాడుతున్నారు.

నీలం రంగుని  పాల ప్యాకెట్ ని టోన్డ్ మిల్క్ అంటారు. ఇందులో సుమారు 3.0% కొవ్వు ఉంటుంది. ఈ పాలు  అందరికీ, ముఖ్యంగా రోజూ తాగే టీ, కాఫీలకు సరిపోతుంది.

ఆకుపచ్చ రంగుని స్టాండర్డైజ్డ్ మిల్క్  అంటారు. ఇందులో సుమారు 4.5% కొవ్వు ఉంటుంది. ఇందులోని పాలు నీలం ప్యాకెట్ కంటే కొంచెం చిక్కగా ఉంటుంది.

నారింజ రంగుని ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు. ఇందులో సుమారు 6.0% కొవ్వు ఉంటుంది. ఈ పాలు చాలా చిక్కగా ఉంటుంది. పెరుగు తోడు పెట్టడానికి లేదా స్వీట్స్ చేయడానికి  బెస్ట్ అని అర్ధం.

పింక్ లేదా మెజెంటాని డబుల్ టోన్డ్ మిల్క్ అంటారు. ఇందులో కేవలం 1.5% కొవ్వు మాత్రమే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి లేదా డైట్‌లో ఉన్నవారికి ఈ పాలు మంచిది.

ఈ రంగులు ఎందుకు ఉపయోగిస్తారంటే 
డెయిరీ కంపెనీలు రంగులను వాడటానికి ముఖ్య కారణం సౌలభ్యం.  షాపుకి వెళ్ళినప్పుడు ప్రతి ప్యాకెట్ మీద ఉన్న అక్షరాలు చదవాల్సిన అవసరం లేకుండా, రంగును బట్టి మనకు కావాల్సిన పాలను వెంటనే తీసుకోవచ్చు. పాల ప్యాకెట్లు సప్లయ్  చేసే వారికి, అమ్మే వారికి ఏ రకం పాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా అర్థమవుతుంది.

రంగు ముదురుగా ఉంటే నాణ్యత ఎక్కువ
చాలామంది పాల ప్యాకెట్ రంగు ముదురుగా ఉంటే పాలు చాలా మంచివని, నాణ్యమైనవని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. రంగు అనేది కేవలం అందులో ఉన్న కొవ్వు  శాతాన్ని మాత్రమే తెలుపుతుంది. అన్ని ప్యాకెట్లలోని పాలు నాణ్యమైనవే, కాకపోతే మీ అవసరాన్ని బట్టి మీకు ఏది కావాలో ఎంచుకోవాలి. 

ఏ కలర్ పాల ప్యాకెట్ కొనాలంటే
మీరు ఏ కలర్ పాల ప్యాకెట్ కొనాలో మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోండి. అంటే పిల్లలకు లేదా స్వీట్స్ చేయడానికి నారింజ రంగు (ఫుల్ క్రీమ్) పాలు బాగుంటాయి. రోజూ తాగడానికి అంటే టీ/కాఫీలకు నీలం రంగు (టోన్డ్) పాలు సరిపోతాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి పింక్ రంగు (డబుల్ టోన్డ్) పాలు బెస్ట్.