జ్యోతిష్యం: మేషరాశిలో బుధుడు.. సూర్యుడు సంచారం.. బుధాదిత్యయోగంతో  దశ తిరిగే రాశులు ఇవే..!

జ్యోతిష్యం: మేషరాశిలో బుధుడు.. సూర్యుడు సంచారం.. బుధాదిత్యయోగంతో  దశ తిరిగే రాశులు ఇవే..!

మేష రాశిలో  సూర్యుడు... బుధుడు  కలవడం వలన  బుధాదిత్య యోగం ఏర్పడింది.  ఈ రెండు గ్రహాలు అక్కడ ఈ నెల 14 వరకు ఉంటాయి.  బుధుడు.. సూర్యుడు కలవడం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.    సూర్యుడికి కి ఉచ్ఛ క్షేత్రంమైన ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆరు రాశుల (మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర ) వారికి ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.  బుధాదిత్య యోగం వలన  ఈ రాశుల వారికి  కలిగే ప్రయోజనాల గురించి  తెలుసుకుందాం.

మేష రాశి :  ఇదే రాశిలో సూర్యుడు .. బుధుడు కలవడం వలన  బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. వీరి  ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.   కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.   పెళ్లి.. ప్రేమ విషయంలో మొదట్లో కొన్ని అవాంతరాలు ఏర్పడినా... చివరికి మీరు అనుకున్నదే జరుగుతుంది. 

మిథున రాశి: బుధాదిత్య యోగం వలన ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు.  ప్రయత్నం తలపె ట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  ప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది.  అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి  రావడంతో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.  పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు

కర్కాటక రాశి: బుధాదిత్య యోగం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పరిశోధనలు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం.  కీలక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకి కూడా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది మంచి సమయం. వ్యాపారంలో కూడా లాభాలు ఎక్కువగా వస్తాయి.నిరుద్యోగులకి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహ రాశి:  బుధాదిత్యయోగం వలన ఈ రాశి వారికి  ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది.యి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి.  కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి.  కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

ధనుస్సు  రాశి : మేషరాశి పంచమ స్థానంలో బుధుడు.. సూర్యుడు కలవడం వలన  ఈ రాశివారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యో గులు ఆశించిన దాని కంటే మంచి ఉద్యోగం సంపాదించుకునే వీలుంది. తండ్రికి కలిసి వస్తుంది.ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. రాజకీయాలు, ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉన్నవారికి వైభవం పెరుగుతుంది. బుధాదిత్య యోగం వలన ప్రభావంతో ప్రతి పనిలోనూ  మీ వెంటే విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. లాభదాయకంగా ఉంటుంది.  ఉద్యోగస్తుల విషయంలో  ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.  వ్యాపారస్తులకు ఒక్కసారిగా... అనుకోకుండా లాభాలు వస్తాయి.  ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య విబేధాలు తొలగి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. . మీ పాత బంధువులను కలిసే అవకాశంతోపాటు.. . కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

మకర రాశి : చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. సామాజికంగా కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో... గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు.   ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  వృత్తి పరంగా పురోగతి ఉంటుంది.  వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.  కొత్తగా భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విహార యాత్రలు చేయడంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.