భూమి కన్నా వేగంగా సముద్రాల్లోనే జీవ వినాశనం…

భూమి కన్నా వేగంగా సముద్రాల్లోనే జీవ వినాశనం…

భూమితో పోలిస్తే సముద్రాల్లోనే జీవ వైవిధ్య వినాశనం ఎక్కువగా ఉందని సైంటిస్టులు గుర్తించారు. చాలా ప్రాంతాల్లో జీవులు అంతరించిపోతున్నాయని తేల్చారు. కెనడాలోని మెక్​గిల్​ యూనివర్సిటీ, బ్రిటన్​లోని సెయింట్​ ఆండ్రూస్​ యూనివర్సిటీ పరిశోధకులు భూమి, సముద్రాల్లోని జీవ జాతులపై స్టడీ చేసి ఈ విషయాన్ని తేల్చారు. బయోటైమ్​ డేటాబేస్​ను ఉపయోగించి 50 వేల డేటాపాయింట్లను అంచనా వేశారు. ప్రతిచోటా జీవవైవిధ్యంలో మార్పులు జరుగుతున్నాయని, కానీ, అన్ని చోట్లా జీవులు అంతరించిపోవట్లేదని సైంటిస్టులు చెప్పారు. భూమితో పోలిస్తే సముద్రాల్లోని జీవజాతులే ఎక్కువగా నష్టపోతున్నాయన్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవలి అమెజాన్​ కార్చిచ్చు ఘటనతో పగడపు దీవుల్లోని అనేక జీవులు చనిపోయాయని గుర్తు చేశారు.