పీఎంజీఎస్‌‌‌‌వై నిధులు 100%  కేంద్రమే భరించాలి  : మంత్రి సీతక్క

పీఎంజీఎస్‌‌‌‌వై నిధులు 100%  కేంద్రమే భరించాలి  : మంత్రి సీతక్క
  • రాష్ట్రాలపై 40 శాతం భారం వేయొద్దు : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌‌‌‌వై) కింద రాష్ట్రానికి మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని మంత్రి సీత‌‌‌‌క్క డిమాండ్  చేశారు. ఇందుకు కావాల్సిన నిధులను గతంలో మాదిరిగానే 100 శాతం కేంద్రమే  భరించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పీఎంజీఎస్‌‌‌‌వై ప్రాంతీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. సీత‌‌‌‌క్క మాట్లాడుతూ పీఎంజీఎస్‌‌‌‌వైకి సంబంధించి  రాష్ట్రాలపై 40 శాతం భారం వేయడం సరికాదన్నారు.