V6 News

మహిళా బిల్లుపై బీజేపీది డ్రామా : మంత్రి సీతక్క

మహిళా బిల్లుపై బీజేపీది డ్రామా : మంత్రి సీతక్క
  • కాంగ్రెస్ హయాంలోనే పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టాం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని మంత్రి సీతక్క ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్​లోని ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని, గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడే పార్లమెంట్​లో బిల్లును ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ ఏదో కొత్తగా చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. బీజేపీ చరిత్రలో ఒక్క మహిళనైనా పార్టీ అధ్యక్షురాలిని చేశారా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ కోటా కచ్చితంగా ఉండాలని డిమాండ్ చేశారు. 

కూలీలకు వసతులు కల్పించాలి

వేసవి నేపథ్యంలో ఉపాధిహామీ కూలీ లకు పని స్థలాల్లో వసతులు కల్పించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హాజరు నమోదు కోసం కేంద్రం అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ తో కార్మికులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయినప్పటికీ ఆ నిబంధనలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని, కూలీలు ఈ విషయాన్ని గ‌‌‌‌మ‌‌‌‌నించాల‌‌‌‌ని కోరారు.