దేశం మేలుకోరి బంగారం అమ్మండి..ఆనంద్ రాఠీ వెల్త్ ఎండీ ఫెరోజ్ సూచన

దేశం మేలుకోరి బంగారం అమ్మండి..ఆనంద్ రాఠీ వెల్త్ ఎండీ ఫెరోజ్ సూచన

న్యూఢిల్లీ: మనదేశ విదేశీ కరెన్సీ నిల్వలు ఖర్చు కావొద్దంటే, దిగుమతుల భారం తగ్గాలంటే.. ప్రజలు తమ దగ్గరున్న దాంట్లో కనీసం 2–4 శాతం బంగారం అమ్మేయాలని వెల్త్​మేనేజ్​మెంట్​ కంపెనీ ఆనంద్ రాఠీ వెల్త్ ఎండీ, సీఈఓ ఫెరోజ్ అజీజ్ సూచించారు. 

భారతీయ కుటుంబాల వద్ద  నాలుగు లక్షల కోట్ల డాలర్లకు పైగా విలువైన బంగారం నిరుపయోగంగా ఉందని అన్నారు. దేశ వార్షిక బంగారం దిగుమతులు విలువ రూ.2.91 లక్షల కోట్ల నుంచి  రూ.6.25 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఫలితంగా కరెంట్ ఖాతా లోటు, రూపాయిపై ఒత్తిడి పెరుగుతున్నాయని ఆయన వివరించారు.