వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ఫైనల్కు జొకోవిచ్‌‌‌ రెడీ

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ఫైనల్కు జొకోవిచ్‌‌‌ రెడీ
  • నేడు వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌
  • సా. 6.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

లండన్‌‌‌‌‌‌‌‌: కెరీర్‌‌‌‌‌‌‌‌లో 21వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా.. సెర్బియా స్టార్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యాడు. ఆదివారం జరిగే మెన్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ 40వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ నిక్‌‌‌‌‌‌‌‌ కిరియోస్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇప్పటివరకు వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ ఏడుసార్లు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ ఆడితే ఆరుసార్లు టైటిల్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ సెర్బియన్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే టెన్నిస్‌‌‌‌‌‌‌‌ హిస్టరీలోనే అత్యధికంగా 32వ సారి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆడనున్న జొకోకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కిరియోస్‌‌‌‌‌‌‌‌ నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చు. ఎందుకంటే కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి స్లామ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న కిరియోస్‌‌‌‌‌‌‌‌కు జొకోపై మంచి రికార్డు ఉంది. 2017లో జొకోతో ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ అతనే గెలిచాడు. ఈ రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఒక్క సెట్‌‌‌‌‌‌‌‌ కూడా గెలవని జొకో.. కిరియోస్‌‌‌‌‌‌‌‌ సర్వ్‌‌‌‌‌‌‌‌ను కూడా బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. కేవలం ఒక్క బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ను మాత్రమే సాధించాడు.