920 గ్రాముల హాష్ ఆయిల్ సీజ్

920 గ్రాముల హాష్ ఆయిల్ సీజ్

మాదాపూర్, వెలుగు: మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. దినేష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద 180 సీసాల్లోని సుమారు 920 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.