సుప్రీం కోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. ఓట్ల లెక్కింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించడంలో తప్పేమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2026 మే 04న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ఉన్నందున.. అత్యవసరంగా పిటిషన్ విచారించిన కోర్టు.. ఎన్నికల సంగం నిర్ణయాన్ని సమర్ధి్స్తూ తీర్పు వెలువరించింది.
పశ్చిమబెంగాల్ లో పోలింగ్ పూర్తయి ఒక కౌంటింగ్ ఒక్కటే మిగిలి ఉంది. ఈవీఎం ల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని టీఎంసీ ముందునుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఎన్నికల సంఘం బీజేపీకి సహకరిస్తోంది.. దీంతో ఫలితాలను తారు మారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది తృనమూల్ కాంగ్రెస్.
కౌంటింగ్ సూపర్వైజర్ ల సహాయకులుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల నియామకాన్ని వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ పీ.ఎస్ నరసింహతో కూడిన ఇద్దరితో కూడిన ధర్మాసనం.. టీఎంసీ పిటీషన్ ను తిరస్కరించింది. ఎన్నికల సంఘం జారీచేసిన సర్కులర్ మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొంది.
