స్పెయిన్‌లో ప్రమాదం జరిగింది. జర్మనీకి చెందిన హెలికాప్టర్ ఆదివారం మలోర్కా ద్వీపం మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న విమానాన్ని ఢీకొట్టింది. ఆకాశంలోనే ఈ రెండు ఢీ కొనడంతో కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు ప్రయాణికులు, పైలట్‌తో పాటు విమానంలోని ఇద్దరు చనిపోయారు. హెలికాప్టర్‌లోని మృతుల్లో దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాన్‌చెజ్ విచారం వ్యక్తం చేశారు.
