ఇంటర్ ప్రాక్టికల్స్లో మాస్ కాపీయింగ్

ఇంటర్ ప్రాక్టికల్స్లో మాస్ కాపీయింగ్
  • ఆ కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 
  • ఇంటర్ బోర్డు ముందు ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ధర్నా

బషీర్​బాగ్​, వెలుగు: ఇంటర్ ప్రాక్టికల్స్​పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని ఆరోపిస్తూ  గురువారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ నేతలు ధర్నా నిర్వహించారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని, ఆ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసి మరీ కాపీయింగ్​కు పాల్పడ్డారన్నారు. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి చిట్టీలతో పరీక్షలు రాయించారన్నారు. దీనిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో మమత, అశోక్ రెడ్డి, కార్తీక్, లెనిన్, అవినాశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.